హెల్త్ ప్రాబ్లమ్ అంటూ ఫేక్ వీడియో…

హెల్త్ ప్రాబ్లమ్ అంటూ ఫేక్ వీడియో…

ఆర్థిక సాయం చేయాలంటూ రిక్వెస్ట్

స్పందించిన వ్యక్తి 59 వేలు ట్రాన్స్ ఫర్

ఫోన్ చేస్తే స్విచాఫ్

పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు

హైదరాబాద్‌, వెలుగు: హెల్త్‌ ప్రాబ్లమ్ ఉందని ఆర్థిక సాయం చేయాలంటూ సోషల్ మీడియాలో ఫేక్ వీడియో పోస్ట్ చేసిన వారిపై చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. బార్కస్‌ ఏజీ సలాలాకు చెందిన మహ్మద్‌ ఇమ్రాన్‌(28) ఈ నెల 16 న హైదరాబాద్‌ యూత్‌ కరేజ్‌ పేరుతో ఉన్న ఫేస్ బుక్ పేజ్‌లో సల్మాన్‌ ఖాన్‌ పేరుతో చేసిన వీడియో గుర్తించాడు. ఆ వీడియోలో యాస్మిన్‌ సుల్తానా అనే యువతి బ్రెయిన్‌ డిసీజస్ తో ట్రీట్మెంట్‌ పొందుతోందని, ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని స్టేట్ బ్యాంక్ ఈదీ బజార్‌‌ బ్రాంచ్ లో అస్రా బేగం 20158272635 అకౌంట్‌, గూగుల్ పే కు 998 9017157 / 6304472322 మనీ ట్రాన్స్ ఫర్ చేయాలని రిక్వెస్ట్‌ చేయడం ఉంది.

దీంతో ఈ నెల 20న ఇమ్రాన్ రూ.59,700 ట్రాన్స్ ఫర్‌‌ చేశాడు. ఫోన్ నెం బర్లకు కాల్‌ చేయగా పని చేయలేదు. అకౌంట్‌ స్టేట్ మెంట్స్‌ చెక్‌ చేయగా సల్మాన్‌ ఖాన్‌, అహ్మద్‌ మొయిద్దీన్ రషీద్‌ అకౌంట్స్ కి రూ. 15 లక్షలు ట్రాన్స్ ర్‌‌ అయినట్లు గుర్తించాడు. దీంతో ఫేక్ వీడియో పోస్ట్‌ చేసి సల్మాన్, అస్రా బేగం,అహ్మద్ మొయిద్దీన్ రషీద్‌తో పాటు మరికొందరు మోసాలకు పాల్పడుతున్నారని వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.