‘ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి’ మూవీ టైటిల్‌‌ సాంగ్‌‌ రిలీజ్

‘ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి’ మూవీ టైటిల్‌‌ సాంగ్‌‌ రిలీజ్

నాగశౌర్య, మాళవిక నాయర్‌‌ జంటగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి’. ఈ మూవీ టైటిల్‌‌ సాంగ్‌‌ను సోమవారం విడుదల చేశారు. ‘ఫలానా అబ్బాయి .. ఫలానా అమ్మాయి ఇవాళే కలిశారు తొలిసారిగా’ అంటూ సాగే ఈ పాటను కళ్యాణి మాలిక్ కంపోజ్ చేశారు. ‘కనులకీ కనులు కవిత రాసెనుగ.. మనసుతో మనసు కలుపుకోగా.. ఒకరిని ఒకరు చదువుతూ మురిసిపోయారు గమ్మత్తుగా’ అంటూ తేలికైన పదాలతో లోతైన భావాన్ని పలికించేలా భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ రాశారు.

ఈ మెలోడియస్‌‌ సాంగ్‌‌ను నూతన మోహన్‌‌తో కలిసి కళ్యాణి మాలిక్  పాడారు. హీరోహీరోయిన్స్‌‌ మధ్య పరిచయం ఎలా ఏర్పడింది..  వాళ్ల ప్రయాణం ఎలా సాగింది అనే విషయాలను తెలుపుతూ సాగే పాట ఇది. లిరికల్ వీడియోలో శౌర్య, మాళవిక కెమిస్ట్రీ ఆకట్టుకుంది.  టీజీ విశ్వప్రసాద్, దాసరి పద్మజ కలిసి నిర్మించిన ఈ చిత్రం మార్చి 17న విడుదల కానుంది.