ఫేమ్‌‌‌‌ 2 స్కీమ్‌‌‌‌ను పొడిగించడం లేదు

ఫేమ్‌‌‌‌ 2 స్కీమ్‌‌‌‌ను పొడిగించడం లేదు
  •     మీడియా రిపోర్ట్స్‌‌‌‌ను ఖండించిన ప్రభుత్వం

న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకాన్ని ప్రమోట్ చేసేందుకు తీసుకొచ్చిన ఫేమ్‌‌‌‌–2 స్కీమ్‌‌‌‌ డెడ్‌‌‌‌లైన్‌‌‌‌ను పొడిగించడం లేదని ప్రభుత్వం ప్రకటించింది.  ఈ నెల 31 తో ముగియాల్సి ఉన్న ఈ స్కీమ్‌‌‌‌ను జులై 31 వరకు పొడిగించారని, ఈ టైమ్ పీరియడ్‌‌‌‌ కోసం రూ.500 కోట్ల సబ్సిడీలను ఇవ్వనున్నారనే వార్తలను హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ  ఖండించింది. ఈ నెల 31 వరకు అమ్ముడైన  ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే  ఫేమ్ స్కీమ్‌‌‌‌ కింద సబ్సిడీ పొందడానికి అర్హత పొందుతాయని క్లారిఫై చేసింది.  

ఇప్పటికే  ఫేమ్‌‌‌‌ స్కీమ్ ఇచ్చే రాయితీలను రూ.10 వేల కోట్ల నుంచి రూ.11,500 కోట్లకు పెంచామని తెలిపింది. కాగా, ఫేమ్ 2 కింద ఎలక్ట్రిక్‌‌‌‌ టూవీలర్ల, త్రీ  వీలర్లు, ఫోర్ వీలర్ల  కోసం రూ.7,0‌‌‌‌‌‌‌‌48 కోట్లు కేటాయించారు. వీటికి తోడు క్యాపిటల్ అసెట్స్ కోసం రూ.4,048 కోట్లు,  ఇతర కేటగిరీ కింద రూ.400 కోట్లు కేటాయించారు.