చికిత్స పొందుతూ వ్యక్తి మృతి.. ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి.. ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన

హైదారాబాద్  ఎల్బీనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు.  మృతుడు నల్లగొండ జిల్లా చింతపల్లికి చెందిన రమేష్(37).  మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే   వైద్యుల నిర్లక్షం వల్లే చనిపోయాడంటూ  ఆస్పత్రి ముందు బంధువులు ఆందోళనకు దిగారు.  

కాళ్ళు నొప్పి లేస్తున్నాయని ఆస్పత్రికి వస్తే స్టంట్ వేయాలని చెప్పి ఆపరేషన్ చేశారు. పేషెంట్ కు సీరియస్ గా ఉందని గంటల కొద్ది వెంటిలేషన్ పై ఉంచి..తర్వాత  వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. వేరే ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా అప్పటికే మృతి చెందినట్లువైద్యులు చెప్పారు. నడుచుకుంటూ వచ్చిన వ్యక్తిని ఆస్పత్రి వైద్యులు వచ్చి రాని వైద్యం చేసి చంపేశారు.  జూనియర్ వైద్యులతో సర్జరి చేయడం వల్లే  ఈ దారణం జరిగిందని ఆరోపిస్తూ  ఆస్పత్రి ముందు బైటాయించారు మృతుడి  బంధువులు.