
వెలుగు, ముషీరాబాద్: బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ (అటానమస్) కాలేజీలో పీజీ విద్యార్థుల ఫేర్వెల్ డే వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. విద్యార్థులు తమ చదువును పూర్తి చేసుకుని మరో అడుగు ముందుకు వేస్తున్న తరుణంలో స్నేహితులతో కలిసి రోజంతా ఆనందంగా గడిపారు. కాలేజీలో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు.