గోదావరిఖని, వెలుగు: బల్హార్షా నుంచి కాజిపేట మార్గంలో వెళ్లే పలు ఎక్స్ప్రెస్ రైళ్లను రామగుండం స్టేషన్‌లో హాల్టింగ్ కల్పించాలని రైల్వే యూజర్స్ కమిటీ మెంబర్, కాంగ్రెస్ లీడర్అనుమాస శ్రీనివాస్ కోరారు. బుధవారం సికింద్రాబాద్ నుంచి రామగుండం రైల్వే స్టేషన్‌కు వచ్చిన డివిజనల్ కమర్షియల్ మేనేజర్ చరణ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ నవజీవన్, స్వర్ణజయంతి, గరీబ్‌రథ్, చెన్నై– -జోదాపూర్ ఎక్స్ప్రెస్ రైళ్లను రామగుండంలో నిలపాలని కోరారు.

