గోదావరిఖని, వెలుగు: ‘నాన్న.. టూవీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ధరించి రోడ్డు భద్రత నియమాలు పాటించు’ అంటూ స్కూల్‌పిల్లలు వారి తల్లిదండ్రులకు భావోద్వేగంతో కూడిన పోస్ట్‌కార్డులు పంపించారు. రోడ్డు భద్రతపై చైతన్యం తీసుకురావడంలో భాగంగా గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం గోదావరిఖనిలో స్కూల్ పిల్లలకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో పేరెంట్స్ హెల్మెట్ ధరించడంపై లెటర్స్ రాసి పంపించారు.

