చిట్టి ఇన్నోసెంట్‌‌‌‌.. కానీ సౌదామిని ఇంటెలిజెంట్

చిట్టి ఇన్నోసెంట్‌‌‌‌.. కానీ  సౌదామిని ఇంటెలిజెంట్

వరుస ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్స్‌‌‌‌లో నటిస్తున్న ఫరియా అబ్దుల్లా.. ఆ జానర్‌‌‌‌‌‌‌‌పై ఇష్టంతోనే రిజెక్ట్ చేయకుండా నటిస్తున్నానని చెప్పింది.  నరేష్ అగస్త్యకు జంటగా  ఆమె నటించిన  లేటెస్ట్ మూవీ ‘గుర్రం పాపిరెడ్డి’.  మురళీ మనోహర్ దర్శకత్వంలో  వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఫరియా అబ్దుల్లా చెప్పిన విశేషాలు.  

“ఈ కథ విన్నప్పుడే   ఫన్, ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ ఎలా ఉంటుందో ఊహించగలిగాను.  ఇందులో  సౌదామిని పాత్రలో నర్సుగా  నటించా.   డాక్టర్ అవ్వాలనుకునే క్రమంలో గుర్రం పాపిరెడ్డి (నరేష్​ అగస్త్య)  పరిచయమై  తన కథంతా మార్చేస్తాడు.  ఆయన గ్యాంగ్‌‌‌‌తో కలిసి  ఒక దోపిడీలో భాగం కావాల్సివస్తుంది. దీనికోసం డిఫరెంట్ గెటప్స్‌‌‌‌లో  కనిపిస్తా.  అందులో ఓల్డ్ ఏజ్ గెటప్‌‌‌‌ కూడా వేయాల్సి వచ్చింది.  ఇలా విభిన్నమైన మేకోవర్స్‌‌‌‌లో కనిపించే అవకాశం తక్కువసార్లు వస్తుంది.  ‘జాతిరత్నాలు’ సినిమాలోని చిట్టి పాత్రతో  సౌదామినిని పోల్చలేం. రెండూ వేర్వేరు పాత్రలు. చిట్టి ఇన్నోసెంట్, కానీ సౌదామిని ఇంటెలిజెంట్‌‌‌‌గా ఉంటుంది. ఇందులో  బ్రహ్మానందం గారు జడ్జి క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో నటించారు. ఆయనతో నాకు  కాంబినేషన్  సీన్స్ లేవు గానీ ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌లో యోగి బాబు గారితో కలిసి చేశాం. ఈ  సినిమాను ఆడియెన్స్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.   ఇక ప్రస్తుతం  ‘భగవంతుడు’  అనే మూవీలో ఇంటెన్స్ క్యారెక్టర్ చేస్తున్నా. అలాగే  ‘గాయపడ్డ సింహం’ చిత్రంలో  ఇంపార్టెంట్ రోల్,  తమిళంలో సందీప్ కిషన్‌‌‌‌తో  ఓ సినిమా చేస్తున్నా. ‘మత్తువదలరా 3’  సన్నాహాల్లో ఉంది.  మరికొన్ని ఇంటరెస్టింగ్‌‌‌‌ ప్రాజెక్ట్స్‌‌‌‌కు డిస్కషన్స్ జరుగుతున్నాయి’’.