గింజ గింజకూ తడి తగిలేలా మొలకలకు నీళ్లు పోస్తున్న రైతులు 

గింజ గింజకూ తడి తగిలేలా మొలకలకు నీళ్లు పోస్తున్న రైతులు 

 సీజన్ ప్రారంభంలో పడిన వర్షాలు తర్వాత ముఖం చాటేయడంతో పత్తి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇటీవల వర్షాలు పడడంతో పత్తి రైతులు విత్తనాలు వేశారు. ఇందులో కొన్ని మొలకలు రాగా, మరికొన్ని భూమిలోనే ఉండిపోయాయి. ప్రస్తుతం ఎండ తీవ్రత మళ్లీ పెరగడంతో వచ్చిన మొలకలు ఎండిపోతుండగా, భూమిలోనే ఉండిపోయిన విత్తనాలు మాడిపోతున్నాయి.

దీంతో వాటిని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పైపులు, బకెట్ల ద్వారా గింజగింజకూ నీరందించే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో ఇప్పటికే 8 వేల ఎకరాలకుపైగా పత్తి విత్తనాలు వేశారు. మరికొన్ని రోజుల్లో వర్షాలు పడకపోతే విత్తనాలు మాడిపోయే ప్రమాదం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు.  - కొణిజర్ల, వెలుగు