తొగుట(రాయపోల్)/చిలప్‌చెడ్/ సిద్దిపేట రూరల్,వెలుగు: ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కారు. మంగళవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వీరానగర్, తిమ్మక్కపల్లి రైతులు ధర్నా చేశారు. వడ్ల బస్తాకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. మెదక్ జిల్లా చిలప్‌చెడ్ మండలం చిట్కుల్‌లో వడ్ల తరలించేందుకు లారీలు రావడం లేదని ఆరోపిస్తూ రైతులు ధర్నా నిర్వహించారు.
వడ్ల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు, బండచెర్లపల్లి గ్రామాల రైతులు సిద్దిపేట– -ముస్తాబాద్ ప్రధాన రహదారిపై పుల్లూరు స్టేజ్ వద్ద బైఠాయించారు.
