
నెల్లికుదురు(కేసముద్రం),వెలుగు: మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ రైతులు తమ వ్యవసాయ భూములకు పట్టా చేయడం లేదని శుక్రవారం వాటర్ ట్యాంక్ ఎక్కారు. జనవరిలో ఫారెస్టు డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చినా ఎంజాయ్మెంట్సర్వే చేయడం లేదని ఆరోపించారు. గతంలో సాదా బైనామాలో దరఖాస్తు చేసుకున్నవాళ్లకు ఎంజాయ్ మెంట్ సర్వే ప్రకారం పట్టాదారు పాస్‌బుక్స్ ఇవ్వాలని, సర్వేయర్‌ను స్పాట్ కు పంపి సమస్య పరిష్కరించాలని, గతంలో చేసిన ఎంజాయ్ మెంట్ లిస్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. తర్వాత తహసీల్దార్ఆఫీసు ముందు బైఠాయించారు.