కూతురి పెళ్లిలో గుండెపోటుతో తండ్రి మృతి

కూతురి పెళ్లిలో గుండెపోటుతో  తండ్రి మృతి

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఇప్పలపల్లిలో విషాదం చోటు చేసుకుంది. కూతురు పెళ్లి వేడుక రోజే తండ్రి చనిపోయాడు. ఇప్పలపల్లిలో కొన్ని గంటల్లో పెళ్లి ముహుర్తం ఉండగా.. తండ్రి రాములికి ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది.. దీంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. 

కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. తండ్రి మరణంతో కుమారై లావణ్య పెళ్లి ఆగిపోయింది.  దీంతో పెళ్లి ఇంట రోదనలు మిన్నంటాయి.