ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల ప్రపోజల్స్​ ఇవే

ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల ప్రపోజల్స్​ ఇవే
  • సర్కారుకు చేరనున్న టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదనలు

హైదరాబాద్, వెలుగు: రానున్న మూడేండ్ల కోసం ప్రైవేటు కాలేజీల్లోని వివిధ కోర్సుల ఫీజుల ప్రపోజల్స్​ రెడీ అవుతున్నాయి. ఏఐసీటీఈ పరిధిలోని కోర్సుల ఫీజుల ఖరారు వాయిదా పడటంతో, మిగిలిన కాలేజీల్లో ఫీజులను నిర్ణయించేందుకు తెలంగాణ ఫీ అండ్ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే అధికారులు బీఈడీ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, బీపీఈడీ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 213 ప్రైవేటు బీఈడీ కాలేజీలుండగా.. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కాలేజీలు 25, బీపీఈడీ కాలేజీలు 13 ఉన్నాయి.

వీటిలో బీఈడీ, ఎల్ఎల్బీ కోర్సుల్లో మినిమమ్ రూ.20వేలు, మ్యాగ్జిమమ్ రూ.36వేలుగా ఫీజు నిర్ణయించారు. ఎల్ఎల్ఎం కోర్సులో కనిష్టంగా రూ.20వేలు, గరిష్టంగా రూ.42వేలుగా ఖరారు చేశారు. బీపీఈడీ కోర్సులో మినిమమ్ రూ.17వేలు, మ్యాగ్జిమమ్ రూ.28వేలుగా నిర్ణయించారు. కాలేజీలతో టీఏఎఫ్ఆర్సీ అధికారులు సమావేశమై ఫీజులు ఖరారు చేశారు. త్వరలో వీటిని సర్కారుకు పంపించనున్నారు. ఆపై ఫీజులను సర్కారు అధికారికంగా ప్రకటించనుంది. 

టీఏఎఫ్ఆర్సీ చైర్మన్​గా మళ్లీ స్వరూప్​ రెడ్డి! 

టీఏఎఫ్ఆర్సీ చైర్మన్​గా 2019లో హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్​ స్వరూప్​రెడ్డిని సర్కారు నియమించింది. ఈ నెల 26తో ఆయన పదవీకాలం ముగిసింది. స్వరూప్​రెడ్డినే మళ్లీ కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఒకటీ, రెండ్రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు రానున్నట్లు తెలిసింది.