కిమ్స్‎లో స్పోర్ట్స్ ఇంజ్యూరీస్‎పై ఫెలోషిప్

కిమ్స్‎లో స్పోర్ట్స్ ఇంజ్యూరీస్‎పై ఫెలోషిప్

పద్మారావునగర్, వెలుగు: కిమ్స్ హాస్పిటల్స్ లో ఆర్థోపెడిక్ స్టడీ, స్పోర్ట్స్ మెడిసిన్‌‌‌‌కు సంబంధించి అంతర్జాతీయ గుర్తింపు పొందిన తొలి ఫెలోషిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రీడాకారులకు అవసరమైన అధునాతన సర్జరీలపై, తక్కువ కోతతో చేసే ఆర్థ్రోస్కోపీ పద్ధతులపై డాక్టర్లకు ఇక్కడ స్పెషల్​ట్రైనింగ్​ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఫెలోషిప్ డైరెక్టర్, ఆర్థ్రోస్కోపీ, స్పోర్ట్స్ మెడిసిన్ హెచ్ఓడీ డా. ఆర్. ఎ. పూర్ణచంద్ర తేజస్వి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా అత్యాధునిక ఆర్థ్రోస్కోపీ పద్ధతుల్లో డాక్టర్లకు ట్రైనింగ్​ఇవ్వడం జరుగుతుందని, క్రీడా గాయాల ట్రీట్​మెంట్​క్వాలిటీని మరింత మెరుగుపరచగలమని తెలిపారు.