
హైదరాబాద్, వెలుగు: పండుగల సీజన్ ప్రారంభం కావడంతో మినీ బ్యాగులు, జ్యువెలరీ, స్మార్ట్ లగేజీ వంటి ప్రీమియం ఫ్యాషన్ వస్తువులకు డిమాండ్ పెరిగిందని అమెజాన్ప్రకటించింది.
గ్లోబల్, ఇండియన్ బ్రాండ్ల నుంచి భారీ కలెక్షన్‌ను అందిస్తున్నామని అమెజాన్ ఫ్యాషన్, బ్యూటీ డైరెక్టర్ సిద్ధార్థ్ భగత్ చెప్పారు. కస్టమర్లు లగ్జరీ ఫుట్‌వేర్, జ్యువెలరీ, యాక్సెసరీలకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు.
తమ కస్టమర్లకు ఫాస్ట్ డెలివరీ, అమెజాన్ పే డిస్కౌంట్లు, ప్రైమ్ మెంబర్షిష్తో ఉచిత డెలివరీ వంటి సదుపాయాలు ఉన్నాయని సిద్ధార్థ్ వివరించారు. క్రాస్ బాడీ బ్యాగ్స్, లక్స్ పెండెంట్స్, యాంటీ- థెఫ్ట్ బ్యాక్ ప్యాక్స్, ట్రాకబుల్ లగేజీ భారీగా అమ్ముడవుతున్నాయని తెలిపారు.