స్టేడియాల్లో బీర్లు బంద్‌‌‌‌

స్టేడియాల్లో బీర్లు బంద్‌‌‌‌

ఖతార్​: ప్రపంచంలో ఎక్కడ సాకర్‌‌ మ్యాచ్‌‌లు జరిగినా.. ఫ్యాన్స్‌‌ బీర్లతో కిక్కెక్కిపోతారు. ఇక వరల్డ్‌‌కప్‌‌ లాంటి మ్యాచ్‌‌లయితే ఈ కిక్ తారాస్థాయికి చేరుకుంటుంది. కానీ ఇప్పుడు ఫ్యాన్స్‌‌కు ఆ కిక్కు లేకుండా చేస్తోంది ఖతార్‌‌ టోర్నీ. ఆదివారం నుంచి జరిగే సాకర్​ వరల్డ్​ కప్‌‌కు ఆతిథ్యమిచ్చే ఎనిమిది స్టేడియాల్లో బీర్లతో పాటు లిక్కర్‌‌ను ఫిఫా బ్యాన్‌‌ చేసింది.

కేవలం నాన్‌‌ అల్కహాలిక్‌‌ బీర్లను మాత్రమే అమ్మడానికి పర్మిషన్‌‌ ఇచ్చింది. ఇంతకుముందు టిక్కెట్‌‌ కొని స్టేడియానికి వచ్చే సాధారణ ఫ్యాన్స్‌‌కు బీర్లు ఎప్పుడూ అందుబాటులో ఉండేవి.  కానీ, చివరి నిమిషంలో బ్యాన్​ విధించడంతో ఫ్యాన్స్​ షాకయ్యారు.