హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. గాలిపటం విషయంలో గొడవపడి ఫ్రెండును కత్తితో పొడిచాడు ఓ విద్యార్ధి. గురువారం ( నవంబర్ 27 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. పాతబస్తిలోని ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గాలిపటం విషయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య మొదలైన ఘర్షణ కత్తితో హత్యాయత్నానికి దారి తీసింది.
గాలిపటం విషయంలో గొడవ తలెత్తడంతో 19 ఏళ్ళ మొహమ్మద్ జియా అలియాస్ రెహాన్ పై కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు మొహమ్మద్ జైద్. గాలిపటం దారం మాంజా విషయంలో జరిగిన వివాదంలో అదే కాలనీకి చెందిన జైద్ కత్తితో దాడికి పాల్పడ్డాడని తెలిపారు పోలీసులు.
ఈ దాడిలో రెహాన్ కు తీవ్ర గాయాలవ్వగా.. చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
