వైసీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ

వైసీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ

కర్నూలు: ఓర్వకల్లు మండల పరిధిలోని కాల్వబుగ్గలో తాగునీటి కోసం వైసీపీకి చెందిన రెండు వర్గాల నాయకులు గొడవపడ్డారు. గ్రామంలో నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దాంతో ఓ వర్గానికి చెందిన నాయకులు సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు. అది నచ్చని మరో వర్గం ప్రత్యర్థి వర్గంపై రాళ్లు, కర్రలతో దాడికి తెగబడింది. ఈ దాడిలో ఇరువర్గాలకు చెందిన వారు గాయపడ్డారు. వారిని కర్నూల్ ప్రభుత్వ ఆప్పత్రికి తరలించారు. గాయపడ్డ వారి ఫిర్యాదు మేరకు ఇరువర్గాలకు చెందిన 13 మందిపై కేసు నమోదు చేసి, అయిదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయమై గ్రామానికి చేరుకున్న స్థానిక సీఐ తాగునీటి సమస్యను పరిష్కరించారు. ఈ గొడవంతా ఆధిపత్యం కోసమేనని ప్రజలు అంటున్నారు.