హెలికాఫ్టర్ దుర్ఘటనకు కొన్ని క్షణాల ముందు.. వీడియో వైరల్

హెలికాఫ్టర్ దుర్ఘటనకు కొన్ని క్షణాల ముందు.. వీడియో వైరల్

బుధవారం ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ తో పాటు.. పలువురు ఆర్మీ అధికారులు మరణించారు. అయితే ఈ ప్రమాదానికి జరగడానికి ముందు దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ సంస్థ ఏఎన్ఐ ప్రమాదానికి ముందు హెలికాఫ్టర్ కు సంబంధించినో వీడియోను రిలీజ్ చేసింది. ప్రమాదం చివరి క్షణంలో హెలికాప్టర్ దట్టమైన పొగమంచులోకి వెళ్లిపోయిన దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలను అక్కడ ఉన్న స్థానికులు తమ సెల్ ఫోన్ లో రికార్డు చేశారు. 

మరో ఐదు కిలోమీటర్లు వెళ్తే.. హెలికాప్టర్ తన గమ్యం చేరుకునేదే. అయితే ఇంతలోనే... ప్రమాదం జరిగిపోయింది. సూలూర్ నుంచి బయల్దేరే ముందు ఆ మార్గంలో తక్కవ ఎత్తులో మబ్బులు ఉంటాయని.. గాలిలో తేమ ఎక్కువగా, కొద్దిపాటి వర్షం ఉంటుందని వాతావరణ సూచనలో తెలిపారు. కానీ ప్రమాద సమయానికి ఉష్ణోగ్రత సుమారు 15 డిగ్రీలుగా ఉంటుంది.. ఆ ప్రాంతంలోని నంజప్పన్ చతిరం లోయ మొత్తం దట్టమైన పొగమంచు అలుముకుందని స్థానికులు చెబుతున్నారు.  రెండు మీటర్ల ముందు ఏముందో కనిపించని పరిస్థితి. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఎంఐ-17వి5హెలికాప్టర్.. పొగమంచు లేకపోతే.. రెండు నిమిషాల్లో వెల్లింగ్టన్ లో ఆగేది. అంతలోపే ఈ దుర్ఘటన జరిగిపోయింది. 

మరోవైపు ప్రమాద స్థలాన్ని పరిశీలించి ఎయిర్ ఫోర్స్ అధికారులు కీలకమైన బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలానికి 30 అడుగుల దూరంలో దీన్ని గుర్తించారు. బాక్స్ లో ఎలాంటి సమాచారం ఉందో అని తెలుసుకొనేందుకు.. దీన్ని డీకోడ్ చేయనున్నారు. అందుకే ఈ బాక్స్ ను ఢిల్లీకి పంపనున్నారు అధికారులు.