హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్డు 3లో అగ్ని ప్రమాదం జరిగింది. సదరన్ మిర్చి రెస్టారెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన హోటల్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్ల సహయంతో మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అధికారులు, హోటల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
