రబ్బరు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం..ఐదుగురు మృతి

రబ్బరు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం..ఐదుగురు మృతి

ఢిల్లీలో శనివారం భారీ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. జిల్‌ మిల్‌ పారిశ్రామికవాడలోని ఓ రబ్బరు ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పడానికి 26 ఫైరింజన్లతో ప్రయత్నిస్తున్నారు. నాలుగు అంతస్థులలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో ప్లాస్టిక్‌, రబ్బరు సానిటరీ వస్తువులను తయారు చేస్తారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా గుర్తించలేదు.

జిల్‌ మిల్‌ పారిశ్రామిక ప్రాంతమైనా చుట్టుపక్కల నివాస భవనాలు చాలా ఉన్నాయి.  వీధులు చాలా ఇరుకుగా, సరైన ప్రణాళిక లేకుండా నిర్మించారని స్థాని‍కులు చెబుతున్నారు.  ఆస్తి నష్టం కూడా భారీగానే జరిగినట్లు అంచనా వేస్తున్నారు యజమానులు.