
హైదరాబాద్ లో సెప్టెంబర్ 1న ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జాంబాగ్ గౌలిగూడ సాగర్ కాంప్లెక్స్‌లోని బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. 18 మంది భవనంలోనే చిక్కుకుపోయారు. భారీగా మంటలు ఎగసి పడటంతో భయాందోళనకు గురయ్యారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను రోబో సాయంతో అదుపులోకి తెచ్చారు. రెస్క్యూ చేసి భవనంలో ఉన్న 8 మందిని సురక్షితంగా కాపాడారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు ప్రాణనష్టం కూడా జరగలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలేంటో పరిశీలిస్తున్నారు.