చిరంజీవి సినిమా సెట్ లో భారీ అగ్నిప్రమాదం

చిరంజీవి సినిమా సెట్ లో భారీ అగ్నిప్రమాదం

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా సెట్ లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్ కోకాపేటలోని లేక్ వద్ద  2022 లో సినిమా కోసం   ఏర్పాటు చేసిన సెట్ అప్పటి నుంచి అలాగే ఉంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ తాగి పడేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.   స్థానికుల సమాచారంతో  ఘటనా స్థలానికి వచ్చిన  వట్టినాగులపల్లి ఫైర్ సిబ్బంది  మంటలను ఆర్పారు. ఎవరీకీ ఎటువంటి ప్రాణహాని జరగలేదు.