కరోనా కాల్ సెంటర్‌‌‌‌‌‌‌‌కు ఒక్క రోజే 140 కాల్స్‌‌‌‌

కరోనా కాల్ సెంటర్‌‌‌‌‌‌‌‌కు ఒక్క రోజే 140 కాల్స్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ఫారిన్ వెళ్లొచ్చినవాళ్లు వణుకుతున్నారు. ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌‌‌‌‌‌‌‌కు మంగళవారం 140 మంది కాల్ చేశారు. వీళ్లలో చాలా మంది ఇండియాకు వచ్చి 28 రోజులు దాటడం, వైరస్ లక్షణాలు లేకపోవడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పారు. మంగళవారం శంషాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌లో విదేశాల నుంచి వచ్చిన 445 మందికి స్ర్కీనింగ్ చేశారు. వీరిలో ఎవరికీ వైరస్‌ లక్షణాల్లేవని ఆరోగ్య శాఖ బులెటిన్‌‌‌‌లో వెల్లడించింది. సోమవారం టెస్ట్ చేసిన ఏడుగురికి వైరస్ నెగెటివ్ వచ్చినట్టు తెలిపింది. మంగళవారం టెస్ట్ చేసిన 36 మంది టెస్ట్ రిజల్ట్స్‌‌‌‌ రావాల్సి ఉంది. ఇప్పటికే అన్ని డిపార్ట్‌‌‌‌మెంట్లను అలర్ట్ చేసిన ప్రభుత్వం, మెట్రో స్టాఫ్‌‌ కౌన్సిలింగ్ ఇస్తోంది. కరోనా లక్షణాలు, ప్రివెంటీవ్ మెజర్స్‌‌‌‌పై అవగాహన కల్పిస్తోంది. మెట్రో స్టేషన్లు, రైళ్లను రోజూ డిటర్జెంట్‌, లిక్విడ్​ క్లీనర్లతో శుభ్రం చేయాలని నిర్ణయించినట్టు మెట్రో ఎండీ ఎన్‌‌‌‌వీఎస్ రెడ్డి వెల్లడించారు.

For More News..

కరోనా కోసం వంద కోట్లు.. రెండు వేల బెడ్లు..