డ్రగ్స్ కేసులో ముగిసిన మొదటి రోజు విచారణ

డ్రగ్స్ కేసులో ముగిసిన మొదటి రోజు విచారణ

ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో నిందితుల మొదటి రోజు కస్టడీ ముగిసింది. తొలి రోజు బంజారాహిల్స్ పోలీసులు పబ్ ఓనర్ అభిషేక్, మేనేజర్ అనిల్ను విచారించారు. ఏపీసీ, నలుగురు ఇన్స్పెక్టర్ల సమక్షంలో దాదాపు 6 గంటల పాటు ఇద్దరినీ విడివిడిగా ప్రశ్నించారు. అభిషేక్, అనిల్ల వ్యక్తిగత సమాచారంతో పాటు ఫోన్ కాల్ డేటా ఆధారంగా విచారణ కొనసాగించారు. పబ్ పార్ట్నర్స్, అగ్రిమెంట్స్ తదితర అంశాలపై పోలీసులు ఇద్దరు నిందితుల నుంచి ఆరా తీశారు. పబ్లో దొరికిన డ్రగ్స్ గురించి మేనేజర్ అనిల్ను  ప్రశ్నించారు. అభిషేక్ కాల్ డేటా రికార్డులోని నెంబర్లతో పాటు పబ్కు వచ్చే కస్టమర్ల వివరాల గురించి అభిషేక్ను క్వశ్చన్ చేశారు. ఇప్పటికే గుర్తించిన 10 మంది డ్రగ్స్ పెడ్లర్ల గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

For more news..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రేవంత్ లేఖ

‘దళిత బంధు’తో దళితుల బతుకుల్లో వెలుగులు