బషీర్‌బాగ్, వెలుగు: మేడ్చల్ జిల్లా ఎల్లంపేటలో ఈ నెల 18న ఉత్తరాఖండ్ కౌథిగ్ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు దక్షిణేశ్వర్ కేదార్నాథ్ మందిర్ ట్రస్ట్ చైర్మన్ జయపాల్ సింగ్ నాయాల్ తెలిపారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఉత్సవాలకు సంబంధించిన పాంప్లెట్స్‌ను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు.
ఈ ఉత్సవాలు ఎల్లంపేటలోని దక్షిణేశ్వర్ కేదార్నాథ్ టెంపుల్ వద్ద మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. ఈ నెల 16, 17 తేదీల్లో టెంపుల్ పరిసర ప్రాంతాల్లో వివిధ దేవతా విగ్రహాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్‌లో కౌథిగ్ ఉత్సవాలను తొలిసారిగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
