హైదరాబాద్ : కూకట్‌పల్లిలోని ఆకాష్ ఇనిస్టిట్యూట్ విద్యార్ధి సిద్దార్థ్ మల్లెల అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఒలింపియాడ్ క్వాలిఫయర్ ఇన్ బయాలజీ (ఐఓక్యుబీ) పరీక్షలో టాపర్ గా నిలిచాడు . భారతీయ జాతీయ స్ధాయి సైన్స్ ఒలింపియాడ్ రెండవ దశ పరీక్ష ఐఓక్యుబీలో తెలంగాణా రాష్ట్రంలో మొదటి ర్యాంకును సాధించాడు. ఈ పరీక్షను బయలాజికల్ సైన్సెస్ లో టీచర్ల సంఘం, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్, హోమి బాబా సెంటర్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ (హెచ్‌బీసీఎస్‌ఈ) సహకారంతో నిర్వహించింది. పరీక్ష కోసం 12వ తరగతి, ఆ లోపు విద్యార్థులు 30 వేల మంది హాజరయ్యారు.
ఐఓక్యుబీ పరీక్షను 12 వ తరగతి విద్యార్థుల కోసం ఉద్దేశించినదే అయినప్పటికీ 11వ తరగతి విద్యార్థులు కూడా పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. పరీక్షలో రాష్ట్రాల వారీ కోటా ప్రకారం విద్యార్థులను తర్వాత దశ పోటీలకు ఎంపిక చేస్తారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో సరాసరి టాప్ టెన్ స్కోర్స్ 80%కు పైగా ఉంటే రాష్ట్రాల కోటాతో సంబంధం లేకుండా తర్వాత దశ పరీక్షకు సెలక్ట్ చేస్తారు.
