V6 News

పార్కింగ్ చేసిన కారులో ఆడుకోవడానికి వెళ్లి... ఐదేళ్ల బాలిక మృతి...

పార్కింగ్ చేసిన కారులో ఆడుకోవడానికి వెళ్లి... ఐదేళ్ల బాలిక మృతి...

నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పార్కింగ్ చేసిన కారులో ఆడుకోవడానికి వెళ్లి ఐదేళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లిలో చోటు చేసుకుంది ఈ విషాద ఘటన. నార్కట్ పల్లికి చెందిన చరణ్య అనే ఐదేళ్ల బాలిక పార్కింగ్ చేసిన కారులో ఆడుకోవడానికి వెళ్లి ఊపిరాడక మృతి చెందింది.

మంగళవారం బయట ఆడుకోవడానికి వెళ్లిన చరణ్య ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికారు తల్లిదండ్రులు. ఈ క్రమంలో పార్క్ చేసిన కారులో చరణ్య విగతజీవిగా పడి ఉండటం గుర్తించారు. కారులో నుంచి చరణ్యను బయటికి తీసి హుటాహుటిన కామినేని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అయితే, అప్పటికే చరణ్య మృతి చెందినట్లు నిర్దారించారు డాక్టర్లు.చరణ్య మరణాన్ని జీర్ణించుకోలేక కన్నీరు మున్నీరవుతున్నారు తల్లిదండ్రులు. ఇంట్లో చలాకీగా ఆడుకుంటున్న తిరిగిన పసిపాప విగతజీవిగా పడి ఉండటంతో చరణ్య తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది.