శామీర్ పేట, వెలుగు: మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ధ్రువ పత్రాలు లేకుండా వాహనంలో తరలిస్తున్న రూ.5 లక్షల నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు నగదు తరలిస్తున్నారన్న సమాచారంతో వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో ఈ నగదు పట్టుబడినట్లు తెలిపారు.
