ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి: లెక్టర్‌‌‌‌‌‌‌‌ అంకిత్‌‌‌‌‌‌‌‌ 

ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి: లెక్టర్‌‌‌‌‌‌‌‌ అంకిత్‌‌‌‌‌‌‌‌ 

సుజాతనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలను రైతులు ఎంచుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌‌‌‌‌‌‌‌ అంకిత్‌‌‌‌‌‌‌‌ సూచించారు. గురువారం సుజాతనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం సింగభూపాలెం, వేపలగడ్డ గ్రామాల్లో పర్యటించారు.

సింగభూపాలెం చెరువులో నీటి నిల్వలను పరిశీలించారు. చెరువులో 19 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి ప్రస్తుతం 14.5 అడుగుల నీరు ఉందని, సుమారు 2,250 ఎకరాలకు సాగునీరు అందుతుందని అధికారులు తెలిపారు. వరికి బదులు పెసర, కూరగాయల సాగును ప్రోత్సహించాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.