ఢిల్లీని కమ్మేసిన పొగమంచు..నిలిచిపోయిన విమానాలు

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు..నిలిచిపోయిన విమానాలు

దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పొగమంచుతో సరిగా కన్పించక పోవడంతో పదుల సంఖ్యలో విమానాలు రన్ వే ఎక్కకుండా, అనుమతి కోసం వేచి చూస్తున్నాయి. విదేశాల నుంచి వస్తున్న విమానాల ల్యాండింగ్ కు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో వాటిని ముంబై, అహ్మదాబాద్ లకు దారి మళ్లిస్తున్నారు.

పొగమంచు కారణంగా బెంగళూరు, శ్రీనగర్ వెళ్లాల్సిన విమానాలు ఆలస్యంగా బయలుదేరుతాయని విమానాశ్రయ వర్గాలు తెలిపారు. మరో 4 విమానాలను దారి మళ్లించామని, పరిస్థితి మెరుగుపడిన తర్వాత అవి తిరిగి న్యూఢిల్లీ చేరుతాయన్నారు అధికారులు.