గండుగులపల్లి ఏకలవ్య స్కూల్లో ఫుడ్‌ పాయిజన్‌.. 60 మందికి అస్వస్థత, నలుగురికి సీరియస్‌

గండుగులపల్లి ఏకలవ్య స్కూల్లో ఫుడ్‌ పాయిజన్‌.. 60 మందికి అస్వస్థత, నలుగురికి సీరియస్‌

భద్రాద్రి కొత్తగూడెం/దమ్మపేట, వెలుగు  : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలోని ఏకలవ్య స్కూల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా స్టూడెంట్స్‌ అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే... బుధవారం చికెన్‌తో భోజనం చేసిన అనంతరం 60 మంది స్టూడెంట్స్‌ వాంతులతో ఇబ్బంది పడ్డారు.

గమనించిన ప్రిన్సిపాల్‌ స్కూల్‌లోనే ట్రీట్‌మెంట్‌ ఇప్పించారు. 30 మంది పరిస్థితి కొంత విషమించడంతో పీహెచ్‌సీ డాక్టర్‌ దివాకర్‌కు సమాచారం ఇవ్వగా.. గురువారం స్కూల్‌కు వచ్చి చికిత్స కొనసాగించారు. స్టూడెంట్ల అస్వస్థత విషయం తెలుసుకున్న అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్కూల్‌కు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు.

స్టూడెంట్లు అస్వస్థతకు గురైతే ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ ప్రిన్సిపాల్‌తో పాటు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు స్టూడెంట్స్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్‌లో సత్తుపల్లిలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.