స్వీట్లపై నో ఎక్స్​పైరీ డేట్స్ పలు షాపులకు నోటీసులు

స్వీట్లపై నో ఎక్స్​పైరీ డేట్స్ పలు షాపులకు నోటీసులు

పంజాగుట్ట, వెలుగు: అమీర్ పేటలోని పలు స్వీట్​షాపుల్లో ఫుడ్ సేప్టీ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. వాసిరెడ్డి ఫుడ్స్, వినూత్న ఫుడ్స్​, ఢిల్లీ మిఠాయి వాలా, ఆగ్రా స్వీట్స్​ షాపుల్లో గడువు ముగిసిన పదార్థాలు వాడుతున్నట్లు గుర్తించారు. స్వీట్​ షాపుల్లో అమ్మే పదార్థాలకు ఎలాంటి లేబుల్స్, ఎక్స్​పైరీ డేట్స్​ వివరాలు ఉండకపోవడంతో హెచ్చరించారు. లైసెన్స్ రెన్యూల్ ​చేసుకోకపోవడం, కిచెన్​పరిశుభ్రంగా ఉండడంతో నోటీసులు ఇచ్చారు.