ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం.. ఇన్ని పదవులు నిర్వర్తించిన మమతకు ఎంత పెన్షన్ వస్తుంది..? రూల్స్ ఏం చెబుతున్నాయి...?

ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం.. ఇన్ని పదవులు నిర్వర్తించిన మమతకు ఎంత పెన్షన్ వస్తుంది..? రూల్స్ ఏం చెబుతున్నాయి...?

లెఫ్ట్ పార్టీ కంచుకోటలు బద్ధలు కొట్టి మూడు సార్లు.. అంటే 15 ఏళ్లు అప్రతిహాసంగా పశ్చిమ బెంగాల్ ను ఏలిన మమతా  బెనర్జీ ఓటమిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 206 సీట్లు సాధించిన బీజేపీ దెబ్బకు.. తృణమూల్ కాంగ్రెస్ కేవలం 80 సీట్లకు పరిమితంగా కావాల్సి వ చ్చింది.  ఎమ్మెల్యేగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా పదవులను అలంకరించిన దీదీ ఓటమితో.. తదుపరి లక్ష్యమేంటి..? ఆమె ఏం చేస్తారు..? ప్రతిపక్ష్యంలో అధికార పార్టీకి చుక్కలు చూపిస్తారా..? బెంగాలీల అస్థిత్వం, ఆత్మగౌరవం అంటూ మునుపటి మాదిరి పోరాటాలు చేస్తారా అంటూ చర్చలు, విశ్లేషణలు సాగుతున్నాయి. 

అదే సమయంలో.. అధికారం కోల్పోవడంతో పాటు ఎమ్మెల్యేగా ఓడిపోయిన మమతకు పెన్షన్ ఎంత వస్తుంది..? ఎమ్మెల్యే, ఎంపీకి ఒక్కో పదవికి ఒక్కో పెన్షన్ ఉంటుంది. అందులో సీఎం గా చేసిన నేత. సో .. ఆమెకు పెన్షన్ ఎంత అందుతుంది..? అనే చర్చ జరుగుతోంది. ఇదే క్రమంలో తను ఓడినప్పటికీ.. పెన్షన్ తీసుకోనని ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. ఈ క్రమంలో పెన్షన్ ఎంత వస్తుంది..? ఆమె తిరస్కరిస్తే.. చట్టం ఏం చెబుతుందో.. తెలుసుకుందాం.

ఎంపీ పెన్షన్:

ఎంపీగా దీదీ పనిచేసినందున మాజీ ఎంపీలకు పెన్షన్ నెలకు 31 వేల రూపాయలు అందుతుంది. సర్వీస్ ప్రకారం ఒక్కో ఏడాదికి 2500 రూపాయలు అదనంగా ప్రతీ ఏడాది కలుస్తుంది. ఆమె 25 నుంచి 30 ఏళ్లుగా పని చేసినందున ఆమెకు దాదాపు 80 వేల నుంచి లక్ష రూపాయల వరకు నెలకు పెన్షన్ అందుతుంది. 

►ALSO READ | వెనుక నిల్చున్న ఈ కుర్రాడు.. డీఎంకేను నామరూపాలు లేకుండా చేస్తాడని.. కరుణానిధి ఊహించి ఉండరు !

ఎమ్మెల్యే పెన్షన్:

ఎంపీతో పాటు ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన దీదీకి పశ్చిమ బెంగాల్ నిబంధనల ప్రకారం.. నెలకు లక్షా 21 వేల రూపాయలు అందుతాయి. దీంతో పాటు సీఎం గా బాధ్యతలు నిర్వర్తించినందున లైఫ్ లాంగ్ బెనిఫిట్స్ అయిన మెడికల్ ఫెసిలిటీస్ తో పాటు జెడ్ ప్లస్ (Z+) సెక్యూరిటీ, స్టాఫ్ సపోర్ట్, ఆఫీస్ నిర్వహణకు కావాలస్సిన సహకారాలు అందుతాయి. 

ఒకేసారి రెండు పెన్షన్స్ తీసుకోవచ్చా..?

ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మొదలైన సేవలు ఎన్ని చేసినా.. నిబంధనల ప్రకారం.. ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్స్ తీసుకోవడానికి లేదు. ఏది ఎక్కువ వస్తే అది ఎంచుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఆమె పెన్షన్ అంగీకరిస్తే.. ఆమెకు నెలకు లక్ష రూపాయలకు పైగా పెన్షన్ వచ్చే అవకాశం ఉంది.