టాలీవుడ్ టాలెంట్ నటుడు తిరువీర్ (Thiruveer) మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో వస్తున్నాడు. ఈ ఏడాది ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’తో హిట్ అందుకున్న తిరువీర్.. రీసెంట్గా ‘పాపం ప్రతాప్’ అనే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్తో వచ్చి అలరించాడు.
ఎస్పీ దుర్గా నరేష్ దర్శకత్వం వహించిన ‘పాపం ప్రతాప్’ ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చి నవ్వులు పూయించింది. ఈ క్రమంలోనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. గురువారం మే 7 నుంచి ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సదరు ఓటీటీ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసి వివరాలు వెల్లడించింది.
తిరువీర్ మంచి కంటెంట్ స్టోరీలనే కాదు, చాలా చిన్న లైన్తో ఆకట్టుకునే కథలను సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇది కూడా చాలా చిన్న కాన్సెప్ట్‌తో నడిచే కథ. కానీ భావోద్వేగంగా, సున్నితమైన అంశాన్ని టచ్ చేస్తుంది. ముఖ్యంగా బయటకు చెప్పుకోలేని సమస్యలతో బాధపడే పురుషుల మనస్తత్వాన్ని ఈ సినిమా చూపించడానికి ప్రయత్నిస్తుంది.
ALSO READ : ఈ వారం ఓటీటీలో దుమ్మురేపే సినిమాలు..
Popcorn ready…
— ETV Win (@etvwin) May 5, 2026
Play button kuda ready 😎🔥
From May 7 #PapamPrathap kadhu Veera Prathap antaru 😉
A Win original production
Premiers May 7th on @etvwin 📺@iamthiruveeR @krishna_kri @rakeshreddy1224 @ThisisNitin1111 @payal_radhu @arvindmule_pd @vishutheone @GuruKiran87… pic.twitter.com/rVGh3C37xO
కథేంటంటే:
ప్రతాప్ (తిరువీర్)కి చిన్నప్పటి నుంచే బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)పై ప్రేమ ఉంటుంది. పెద్దలను ఒప్పించి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. అయితే పెళ్లి అయిన మూడు రోజులకే బుజ్జమ్మ పంచాయితీ పెట్టి, భర్తతో సంసారం చేయలేనని చెబుతూ పుట్టింటికి వెళ్లిపోతుంది.
అయితే సమస్య ఏమిటో మాత్రం ఎవరికీ చెప్పదు. తనలో ఉన్న సమస్యను తానే గుర్తించి సరిదిద్దుకుంటేనే తిరిగి వస్తానని ప్రతాప్‌కు షరతు పెడుతుంది. దీంతో ఊరిలో ప్రతాప్‌పై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుకుంటారు. ఇక తనలో ఉన్న సమస్య ఏమిటో తెలుసుకునేందుకు ప్రతాప్ చాలా ప్రయత్నిస్తాడు.
ఇంతకీ ప్రతాప్‌లో ఉన్న సమస్య ఏంటీ? చివరకు ఆ సమస్య ఏంటో తెసులుసుకుని, సరిచేసుకున్నాడా? పెళ్ళైన ఆ మొదటి మూడు రాత్రుల్లో ఏం జరిగింది? చివరికి బుజ్జమ్మతో మళ్లీ కలిశాడా? అన్నదే మిగతా కథ.
