ఈ వారం (ఏప్రిల్ 8, 2026న) ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు వస్తున్నాయి. భారీ అంచనాలతో ఎదురుచూసే వెబ్ సిరీస్‌లు, సినిమాలు ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. అందులో స్పై యాక్షన్ థ్రిల్లర్స్, యాక్షన్ క్రైమ్, డార్క్ కామెడీ వంటి జానర్ మూవీస్ అందుబాటులోకి రానున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? అవెక్కడ స్ట్రీమ్ అవ్వనున్నాయి? అనేది ఓ లుక్కేద్దాం.
‘డెకాయిట్’ ఓటీటీ
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్'. భారీ అంచాలతో ఈ మూవీ ఏప్రిల్ 10, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించింది. ఇపుడు ఈ థ్రిల్లర్ మూవీ త్వరలోనే ఓటీటీకి ఎంట్రీ ఇవ్వనుంది. వీకెండ్ స్పెషల్గా శుక్రవారం మే 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమ్ అవ్వనుంది.
‘LIK’ ఓటీటీ:
కోలీవుడ్ యంగ్ హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ నటించిన రీసెంట్ మూవీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK). విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఏప్రిల్ 10న విడుదలైన ఈ మూవీ, రేపటి నుంచి (మే 6) ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించగా, ఎస్.జె. సూర్య విలన్గా నటించాడు. ఈ మూవీ తొలి మూడు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇండియాలో రూ.43 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.
‘వాలా 2’ ఓటీటీ:
ఇటీవల కేరళ బాక్సాఫీస్ దగ్గర రెండు వందల కోట్ల మైలురాయిని దాటి సంచలనం సృష్టించిన చిత్రం ‘వాలా 2’. సావిన్ ఎస్.ఏ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వంటి యువ నటీనటులు నటించారు. దర్శకుడు అల్ఫోన్స్ పుత్రన్ కీలక పాత్ర పోషించారు. తెలుగు నిర్మాత సాహు గారపాటి తెలుగులో రిలీజ్ చేశారు. ఇపుడు ఈ యూత్ కాలేజ్ డ్రామా మే 8 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ స్ట్రీమ్ అవ్వనుంది.
‘సిటాడెల్ సీజన్ 2’ ఓటీటీ:
రిచర్డ్ మాడెన్, ప్రియాంక చోప్రా జంటగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సిటాడెల్ సీజన్ 2’. ఈ సీజన్ 2 గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వస్తున్న ఈ రెండో సీజన్ మే 06 నుంచి ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మొదటి భాగం కంటే ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, హై-వోల్టేజ్ డ్రామా ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది.
‘భరతనాట్యం 2:’ ఓటీటీ
మలయాళంలో సంచలనం సృష్టించిన బ్లాక్ బస్టర్ మూవీ 'భరతనాట్యం 2: మోహినియాట్టం'. ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్, థియేటర్లలో సుమారు రూ.40 కోట్ల కలెక్షన్లతో సత్తా చాటింది. ఇందులో సైజు కురుప్, సూరజ్ వెంజరమూడు, జగదీష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సూపర్ హిట్ మూవీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా మే 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉండనుందని సమాచారం.
