యూసఫ్‌గూడలోని మండి రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహించారు. రోజురోజూ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో బయటపడుతున్న విషయాలు చూస్తుంటే.. హోటల్ ఫుడ్ అంటేనే ఒళ్ళు గగ్గుర పెడుతుంది. రాజీవ్ నగర్ లోని అల్ ఖాసీం ది మండీ హౌజ్ లో అపరిశుభ్రంగా ఉన్న కిచెన్ లో నేలపైనే వంట సామగ్రిని ఉంచడాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఫ్రిడ్జిలో వేస్ట్ వాటర్ స్టోరేజ్, వంట గిన్నెలు, స్టవ్ శుభ్రంగా లేవు. అల్ మతమ్ మదీనా మండీలో సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగం, కిచెన్ లోనే చెత్త వేస్తున్నారని నిర్వహకులపై అధికారులు ఫైర్ అయ్యారు. అల్ మతమ్ అల్ హింద్ అరేబియన్ మండీలో అపరిశుభ్ర వంట గది, చిమ్ని, వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు.
కిచెన్ లో బొద్దింకలు తిరుగుతున్నాయి. ఏజీ కాలనీలోని మహమ్మదీయ షవర్మ సెంటర్ లో గ్రీజులా మారిన వంట నూనె ఫుడ్ తయారీకి వాడుతున్నారు. అలాగే షవర్మ తయారీకి తుప్పుపట్టిన పాత్రలు వాడుతున్నారు. ఫ్రిడ్జిలో కుళ్లిన ఆహార పదార్థాలు స్టోర్ చేశారని దాడులు నిర్వహించిన అధికారులు గుర్తించారు.
