అడవులకు, ఆదివాసులకు వీడతీయని బంధం ఉంది : కోదండ రెడ్డి

అడవులకు, ఆదివాసులకు వీడతీయని బంధం ఉంది : కోదండ రెడ్డి

అటవీ, పోడు భూముల సమస్య సద్దుమనగడం లేదని కిసాన్ సెల్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ కోదండ రెడ్డి అన్నారు. కేసీఆర్ చాలా సార్లు హామీ ఇచ్చి వదిలేశాడన్న ఆయన... అడవులకు, ఆదివాసులకు వీడతీయని బంధం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆదివాసులకు చాలా చేసిందన్నారు. పోడు భూముల హక్కుల విషయంలో కోనేరు రంగారావు కమిటీ వేశామని తెలిపారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక అమలు చేయడానికి ప్రయత్నించిందన్నారు. 

ఇందిరాగాంధీ హయాం నుండి భూముల పంపకాలు చేశామన్న కోదండ రెడ్డి... అసైన్డ్, ఇనాం భూములు, ఎండో మెంట్ భూముల విషయంలో పకడ్బందీగా పనిచేసిందని చెప్పారు. టీఆర్ఎస్ మాత్రం దళిత గిరిజనులను ఆగం చేసిందని ఆరోపించారు. ఆదివాసీ భూములను దళితల భూములను లాక్కుందన్న ఆయన... ఇవ్వకపోతే లాఠీ చార్జీలు, పోలీసు కేసులు పెట్టి జైలుకు పంపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకోవాలని, ధరణి పోర్టల్ తీసుకొచ్చి అన్ని రకాల భూములను నిషేదిత జాబితాలో పెట్టి ఇబ్బంది పెడ్తున్నారని కోదండ రెడ్డి విమర్శించారు.