కోల్‌కతా: బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కోల్‌కతాలోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రి సీఈవోపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అందుకు సంబంధించిన ఆడియో క్లిప్‌ను బీజేపీ రాష్ట్ర నేత ఒకరు షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై మూక దాడి జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
అభిషేక్ బెనర్జీపై సోనార్‌పూర్‌లో అటాక్ అనంతరం.. చికిత్స కోసం బెల్ వ్యూ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయనకు కేవలం ఛాతీపై స్వల్ప గాయాలు మాత్రమే ఉన్నాయని, హాస్పిటల్‌లో చేర్చుకోవాల్సిన అవసరంలేదని డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. తన మేనల్లుడికి తీవ్రమైన ముప్పు ఉందని భావించిన మమతకు హాస్పిటల్ నిర్ణయం తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
