గిల్ మూడు ఫార్మాట్లు ఆడగల సత్తా ఉన్న ఆటగాడు:వసీం జాఫర్

 గిల్ మూడు ఫార్మాట్లు ఆడగల సత్తా ఉన్న ఆటగాడు:వసీం జాఫర్

టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్పై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్లో కోహ్లీ తర్వాత అంతటి స్థాయి ఆటగాడు గిల్ అని కితాబిచ్చాడు. శుభ్మన్ గిల్ మూడు ఫార్మాట్లు ఆడగల సత్తా ఉన్న ఆటగాడని చెప్పాడు. బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టులో గిల్ సెంచరీ చేయడం సంతోషంగా ఉందన్నాడు. సెంచరీ చేసే అవకాశాన్ని పలు మార్లు చేజార్చుకున్న గిల్..తొలి టెస్టులో ఆ మైలురాయిని అందుకోవడం వల్ల ఒత్తిడి తగ్గించుకున్నాడని చెప్పుకొచ్చాడు. 

టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్పై జాఫర్ విమర్శలు గుప్పించాడు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్లో రాహుల్ 22,23 పరుగులే చేశాడని..అతని ఆట సరిగా లేదన్నాడు. గత కొద్ది కాలంగా రాహుల్ ఆటతీరు సరిగా లేదన్నాడు. అయితే జట్టులో అతను వైస్ కెప్టెన్గా ఉన్నాడని..అతన్ని తీసేయడం కష్టమని చెప్పుకొచ్చాడు. రెండో టెస్టుకు రోహిత్ అందుబాటులోకి వస్తే ఒక స్పిన్నర్ ను తీసేసి..రోహిత్ శర్మకు తుది జట్టులో చోటిస్తారని చెప్పారు. వైస్ కెప్టెన్ హోదాలో రాహుల్ జట్టులో చోటు దక్కించుకుంటాడని వెల్లడించాడు. 

బంగ్లాదేశ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో శుభ్ మన్ గిల్  తన తొలి టెస్టు శతకం సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో 20 పరుగులే చేసి ఔటైన గిల్...రెండో ఇన్నింగ్స్ లో మాత్రం సెంచరీ కొట్టాడు. 150 బంతుల్లో 110 పరుగులు చేశాడు. ఇది గిల్ కెరీర్‌లో తొలి టెస్టు శతకం.