నాకు క్యాన్సర్.. ఏడాది మాత్రమే బ్రతుకుతాను: ఇంగ్లాండ్ మాజీ కోచ్

నాకు క్యాన్సర్.. ఏడాది మాత్రమే బ్రతుకుతాను: ఇంగ్లాండ్ మాజీ కోచ్

క్యాన్సర్ మహమ్మారి కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్లు మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలో ప్రతి 6వ మరణం క్యాన్సర్ కారణంగానే సంభవిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. టెక్నాలజీ పరంగా క్యాన్సర్ చికిత్సకు అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నా.. ప్రాణాలు కోల్పోతున్న వారు ఇప్పటికీ ఉన్నారు. చదవడానికి ఇదొక కథనంలా అనిపించినా.. వ్యాధి కారణంగా ఒక మనిషి అర్థాంతరంగా తనువు చాలించడం బాధాకరం. అలాంటిది తాను ఇంకో ఏడాది మాత్రమే బ్రతుకుతానని తెలిసిన ఓ వ్యక్తి.. ఎలాంటి మనోవేదన అనుభవిస్తుంటారో ఆలోచించదగ్గ విషయం.     

ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ జ‌ట్టు మాజీ కోచ్ స్వెన్ గోర‌న్ ఎరిక్సన్.. త‌న‌కు క్యాన్సర్ ఉంద‌ని, ఎక్కువ రోజులు బ‌త‌క‌న‌ని తెలిపారు. స్వీడిష్ రేడియో పి1లో మాట్లిడిన ఎరిక్సన్.. "ఒకరోజు తాను ఉన్నట్టుండి కింద ప‌డిపోయానని, అనంతరం టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ ఉంద‌ని వైద్యులు తెలిపినట్లు వెల్లడించారు. తాను ఇంకో ఏడాది మాత్రమే బ‌తికే అవకాశ‌ముంద‌ని వైద్యులు చెప్పినట్లు ఆయన భావోద్వేగంతో చెప్పుకొచ్చారు." 

"క్యాన్సర్ కార‌ణంగానే జ‌నంతో క‌ల‌వడం మానేశానని, సాధ్యమైన‌న్ని రోజులు ఆ మ‌హ‌మ్మారితో పోరాడటం తప్ప తనకు మరో దారిలేదని ఎరిక్సన్ తెలిపారు. అయితే, ప్రస్తుతం దాని గురించి ఆలోచించకపోవడమే మంచిదని చెప్తూ చుట్టూ ఉన్నవారిని కంటతడి పెట్టించారు.."

ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ జ‌ట్టు కోచ్ ‌గా ఎరిక్సన్ నాలుగేళ్లు పనిచేశారు. గతంలో తనకు మహిళలు బలహీనత ఉన్నట్లు ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.