V6 News

దేశాభివృద్ధికి సెన్సస్ కీలకం.. ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

దేశాభివృద్ధికి సెన్సస్  కీలకం.. ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

ముషీరాబాద్/ ఉప్పల్, వెలుగు: దేశాభివృద్ధి ప్రణాళికలకు అత్యంత కీలకమైన సెన్సస్- 2027 (జనగణన) ప్రక్రియలో ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా భాగస్వామి కావాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి పిలుపునిచ్చారు. 

ఆదివారం రాంనగర్​లోని దత్తాత్రేయ నివాసానికి వచ్చిన జీహెచ్‌ఎంసీ అధికారులు ఆయన వివరాలను నమోదు చేయగా, తార్నాకలోని తన నివాసంలో శ్రీలతాశోభన్ రెడ్డి ఆన్​లైన్ పోర్టల్ ద్వారా ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ పూర్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చే సమాచారం భవిష్యత్తు అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుందని, ప్రత్యేక యాప్ ద్వారా ఎవరికి వారు స్వయంగా వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు.