ఐపీఎల్ లో ఖరీదైన ఆటగాడు…కానీ ఇప్పుడు కారు డిక్కీలో జీవితం

ఐపీఎల్ లో ఖరీదైన ఆటగాడు…కానీ ఇప్పుడు కారు డిక్కీలో జీవితం

అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటేనే బాగుంటుంది లేదని ఎగిరెగిరి పడితే ఇలానే ఉంటుంది. ఈ సామెత ఆస్ట్రేలియా క్రికెటర్ ల్యూక్ పోమర్స్‌ బ్యాచ్ కు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది.

ఒకప్పుడు తారాజువ్వలా ఎగిసి పడిన ల్యూక్ జీవితం ఒక్కసారిగా అగాధంలోకి పడిపోయింది. 2007లో జరిగిన టీ20మ్యాచ్ లో ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెటర్ గా కెరియర్ ప్రారంభించిన ల్యూక్..అనతికాలంలో విదేశీ మ్యాచ్ ల్లో ఆడాడు. ఆ తరువాత అత్యంత ఖరీదైన ఐపీఎల్ సీజన్ లో 3లక్షల డాలర్లు పలికి ప్రశంసలందుకున్నాడు. ఐపీఎల్ సీజన్ లో 4ఏళ్లపాటు నిర్విరామంగా కొనసాగాడు. ఆ నాలుగేళ్లలో వద్దంటే వచ్చిపడే డబ్బు. ఎండార్స్ మెంట్స్, యాడ్స్ తో జీవితం మూడుపువ్వులు ఆరుకాయలుగా కొనసాగింది. కానీ 2011లో మనిషికి నైతిక విలువలు దిగజారితే తనలాగే ప్రవర్తిస్తాడని ల్యూక్ నిరూపించాడు.

క్రికెటర్ గా పేరు ప్రఖ్యాతలు గడించిన ఈ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఒక్కసారిగా దిగజారిపోయాడు.  ఐపీఎల్ సీజన్ కొనసాగుతుండగానే అమెరికాకు చెందిన ఓ యువతిని వేధించి జైలు పాలయ్యాడు. అప్పుడే ల్యూక్ పతనం ప్రారంభమైంది. అరెస్ట్ తో ఐపీఎల్ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. ఆ తరువాత 2014 క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు . బార్ లో గొడవ, బైక్ దొంగతనం ఇలా ఒకటేమీ నిత్యం సమస్యలతో  సహవాసం చేసేవాడు . ఎంతలా అంటే ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయి రోడ్డున పడ్డాడు. కనీసం నిలువ నీడ లేకపోవడంతో కారు డిక్కీలో తలదాచుకునేంతలా . తాజాగా  ల్యూక్ మరో సారి దొంగతనం కేసులో అరెస్టై అయ్యాడు. దొంగతనం కేసులో ల్యూక్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.