హైదరాబాద్: జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహెల్ జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 2022లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో హిట్ అండ్ రన్ కేసులో రాహెల్ నిందితుడిగా ఉన్నాడు. నిందితుడు అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. కోర్టు ఆదేశాలతో అతడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
2022 మార్చి 18న జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో జరిగిన యాక్సిడెంట్‌లో నాలుగున్నరేండ్ల బాలుడు చనిపోయాడు. బాధితులు ఫుట్‌పాత్‌పై షెల్టర్ తీసుకునే వారు కావడం గమనార్హం. ఈ యాక్సిడెంట్కు కారణమైన కారుపై మాజీ ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ ఉంది. 2022 మార్చి 18న తెల్లవారుజామున జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో జరిగిన రోడ్డు ప్రమాదంలోను షకీల్ కొడుకు రాహిల్ నిందితుడిగా ఉన్నాడు.
దుర్గం చెరువు నుంచి జూబ్లీహిల్స్ వైపు మహింద్రా థార్ వాహనంలో వస్తున్న కొందరు యువకులు.. రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు గాయపడగా, రెండు నెలల పిల్లవాడు ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడు కారులోని యువకులు పారిపోయారు. వెహికల్అక్కడే వదలగా ఎమ్మెల్యే స్టిక్కర్ఉండడంతో విచారించగా బోధన్మాజీ ఎమ్మెల్యే షకీల్‌ది అని తేలింది. ప్రమాదం జరిగినప్పుడు తన కొడుకు లేడని షకీల్ ప్రకటించాడు.
బాధితుల వాంగ్మూలాలు, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కారులో రాహిల్ ఉన్నట్లు తేలింది. డ్రైవింగ్ సీట్ నుంచి లావుగా ఉన్న యువకుడు పారిపోయాడంటూ బాధితురాళ్లు వాంగ్మూలం ఇవ్వడంతో రాహిల్ డ్రైవింగ్ సీట్లో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ కేసులో కూడా షకీల్ తన కుమారుడిని తప్పించినట్లు పోలీసులు గుర్తించారు.
2023 డిసెంబర్ 23న కూడా ప్రజాభవన్ దగ్గర షకీల్ కొడుకు రాహిల్కారుతో బీభత్సం సృష్టించాడు. తాగిన మైకంలో రాత్రి 2.45 గంటల ప్రాంతంలో ప్రజాభవన్ వద్ద బారికేడ్లను ఢీ కొట్టాడు. ఆ సమయంలో కారులో ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులున్నారు. పంజాగుట్ట పోలీసులు స్పాట్‌కు వెళ్లి కారు నడుపుతున్న రాహిల్‌ను పీఎస్‌కు తీసుకువెళ్లారు.
విషయం తెలుసుకున్న షకీల్ ఆ రోజు రాత్రే పోలీస్‌స్టేషన్‌కు వచ్చి కొడుకుకు బదులు ఇంట్లో పనిచేస్తున్న అబ్దుల్ ఆసిఫ్‌ను నిందితుడిగా చేర్చారు. సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు షకీల్‌ను కూడా కేసులో నిందితుడిగా చేర్చారు. తర్వాత పోలీసులకు మస్కా కొట్టి కొడుకుతో సహా దుబాయ్ పారిపోయాడు. తల్లి మరణంతో హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో.. ఆయనపై లుక్అవుట్సర్క్యులర్లు జారీ కావడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

