వన్డేలంటేనే విసుగు పుట్టింది

వన్డేలంటేనే విసుగు పుట్టింది

వన్డే ఫార్మాట్ ఫ్యూచర్పై టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రానున్న రోజుల్లో వన్డేలపై ఆసక్తి తగ్గిపోతుందన్నాడు. ఫ్యూచర్ అంతా టీ20,టీ10లదే అని తేల్చిపారేశాడు. ప్రస్తుతం ఐఎల్ టీ20లీగ్లో దుబాయ్ కాపిటల్స్ తరపున ఆడుతున్న ఉతప్ప..టీ20లు, టెస్టులకు ఉన్నంత క్రేజ్..వన్డేలకు లేదన్నాడు. 

ఫుట్బాల్ ఆట వలే..క్రికెట్లోనూ ఫ్రాంచైజీ లీగ్లకు విపరీతమైన క్రేజ్ పెరిగిందని రాబిన్ ఉతప్ప చెప్పాడు. వరల్డ్ వైడ్గా అనేక క్రికెట్ లీగ్లు పుట్టుకొచ్చాయని..ప్రతీ క్రికెటర్కు అవకాశం లభిస్తుందన్నాడు.  ఈ నేపథ్యంలో 50 ఓవర్ల పాటు ఆటను చూసే ఆసక్తి జనాల్లో తగ్గిపోతుందన్నాడు. వన్డేను చూసే ఓపిక జనాలకు లేదని..ఇప్పటికే వన్డేలంటే అభిమానులకు విసుగు పుట్టిందన్నాడు. 

క్రికెట్లో భవిష్యత్ టీ20,టీ10లదే అని రాబిన్ ఉతప్ప అన్నాడు. ఇప్పటికే టీ20 క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తోందన్నాడు. రాబోయే రోజుల్లో టీ10 ఫార్మాట్ను కూడా జనాలు ఆదరిస్తారని చెప్పుకొచ్చాడు. అయితే ఫ్యాన్స్ ఎక్కువ దేన్ని కోరుకుంటారో..క్రికెటర్లు కూడా అదే ఆడాలన్నారు. చూడని మ్యాచులు ఆడితే వ్యూయర్ షిప్తో పాటు..స్పాన్సర్లు ఉండరన్నాడు. 

2022 సెప్టెంబర్ 14న 37 ఏళ్ల వయసులో రాబిన్ ఉతప్ప ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తరపున 46 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. ఐపీఎల్ లాంటి లీగ్లు ఆడిన ఉతప్ప...ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్ 20లో పాల్గొంటున్నాడు.