డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పదవికి గడల శ్రీనివాస్‌‌రావు పనికిరాడు

 డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పదవికి గడల శ్రీనివాస్‌‌రావు పనికిరాడు

హైదరాబాద్​, వెలుగు: డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్) పదవికి గడల శ్రీనివాస్‌‌రావు పనికిరాడని, వెంటనే ఆ పోస్టు నుంచి ఆయన్ని తొలగించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌‌జీజీ) సెక్రటరీ పద్మానాభరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఈ మేరకు సీఎస్ శాంతి కుమారికి లేఖ రాశారు. డీహెచ్‌‌ రాజకీయాల్లోకి వెళ్తున్నార నే ప్రచారం గత కొంత కాలంగా జరుగుతుందని, అందుకే ప్రజలను ఆకట్టుకునేందుకు చిత్ర విచిత్ర ప్రకటనలు చేస్తున్నారన్నారు. గతేడాది నుంచి డీహెచ్‌‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తన లేఖలో పేర్కొన్నారు. పదే పదే తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ డీహెచ్ పదవి హోదాను శ్రీనివాస్‌‌రావు దిగజారుస్తున్నారని చెప్పారు. కరోనా ఏసు ప్రభు దయతో తగ్గిందని, తాయత్తుల వల్లే తాను ఈ హోదా లో ఉన్నానని, నక్సలైట్ల అడుగు జాడల్లో తాను పెరిగానని.. ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పద్మనాభరెడ్డి తన లేఖలో గుర్తుచేశారు.