ఖమ్మం జిల్లా ములకలపల్లి మండలంలో రూ.కోటీ73 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఖమ్మం జిల్లా ములకలపల్లి మండలంలో రూ.కోటీ73 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ములకలపల్లి, వెలుగు : ములకలపల్లి మండలంలో రూ.కోటీ73 లక్షలతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు బుధవారం అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మూకమామిడి నుంచి ఎర్రప్పగుంపు వరకు బీటీ రోడ్డు, కొత్త గంగారంలో వాగు వద్ద గేట్​వాల్​, జగన్నాధపురంలో 2 మహిళా సమాఖ్యల భవనాలకు శంకుస్థాపనలు చేశారు.

రింగరెడ్డిపల్లి, గొల్లగూడెం, విజయపురి కాలనీల్లోని 3 ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, చౌట్టిగూడెం, పొగళ్లపల్లి, తాళ్లపాయలో 47 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు. జగన్నాధపురం, ములకలపల్లి జడ్పీ హెచ్ఎస్​లో బడిబాట కార్యక్రమం నిర్వహించి, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.