నలుగురు ఇంటర్ స్టూడెంట్లు బలి.. ఫెయిలవుతానని ఒకరు.. రిజల్ట్స్ చూసి ముగ్గురు..

నలుగురు ఇంటర్ స్టూడెంట్లు బలి.. ఫెయిలవుతానని  ఒకరు.. రిజల్ట్స్ చూసి ముగ్గురు..
  • ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాలతో పాటు సికింద్రాబాద్​ పరిధిలో ఘటనలు


మధిర/మెదక్/ఆదిలాబాద్/పద్మారావునగర్:రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల వేళ తీవ్ర విషాదం నెలకొన్నది. పరీక్షల్లో ఫెయిలవుతామనే భయం, తక్కువ మార్కులు వస్తాయనే ఆందోళనతో నలుగురు విద్యార్థులు నిండు ప్రాణాలను బలితీసుకున్నారు. ఒకరు రిజల్ట్స్ రాకముందే భయంతో తనువు చాలిస్తే.. మరో  ముగ్గురు ఫలితాలు వచ్చాక మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన గంగదేవుల అక్షాంత్ ఇటీవల ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాశాడు. 

ఎంపీసీ చదువుతున్న అక్షాంత్.. తాను పరీక్షల్లో ఫెయిలవుతానని కొద్దిరోజులుగా టెన్షన్​కు గురయ్యేవాడు. గురువారం మధిర దగ్గర రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం రిజల్ట్స్ రాగా అక్షాంత్‌కు ఎంపీసీలో 347 మార్కులు వచ్చాయి. అక్షాంత్ మంచి మార్కులతో పాసైన విషయం తెలిసి కుటుంబ సభ్యులు,  కన్నీరుమున్నీరుగా విలపించారు. 

  • ఫెయిలయ్యామని ఉరేసుకుని ముగ్గురు..

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తిలో మరో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన చాకలి సాయిరాం (17) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో సీఈసీ సెకండియర్ చదివాడు. ఆదివారం రిజల్ట్స్ చూడగా రెండు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయిరాం.. ఇంట్లో ఎవరూ లేని టైం చూసి ఉరి వేసుకున్నాడు.  

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం దంతన్‌పల్లికి చెందిన జిల్లపెల్లి బక్కన్న, బుచ్చవ్వ దంపతుల కుమార్తె సౌజన్య (17) కూడా ఇంటర్​లో ఫెయిల్​కావడంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది.  సికింద్రాబాద్​ మారేడ్​ పల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న కొయ్యాడ కళ్యాణి బేగం(18) ఇంటర్​ఫస్ట్​ఇయర్ (ఎంపీసీ)లో ఫెయిల్​అయ్యానని తీవ్ర మనస్తాపానికి గురైంది. వారసిగూడ లోని తమ ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  
ఫెయిల్‌ అయ్యానని 

  • ఇంట్లోంచి వెళ్లిపోయిన విద్యార్థి..

నందిపేట:  నిజామాబాద్​జిల్లా డొంకేశ్వర్​మండలం జిజి.నడ్కుడ గ్రామానికి చెందిన కొరిపల్లి అరవింద్ రెడ్డి... జిల్లా కేంద్రంలోని అల్పోర్స్​ జూనియర్​ కళాశాలలో ఇంటర్ ఫస్ట్​ఇయర్​చదువుతున్నాడు.  నాలుగు సబ్డెక్టులు ఫెయిల్​కావడంతో ఇంటి నుంచి పారియాడు.

  • 12MDR01 - అక్షాంత్‌ మార్కుల లిస్ట్‌(ఖమ్మంజిల్లా)
  • 12gdh01 సౌజన్య (ఫైల్‌ఫోటో )(ఆదిలాబాద్​జిల్లా)
  • 12HCITY35: కళ్యాణి బేగం( ఐడెంటీటీ  కార్డు ,,,,ఫైల్​ ఫొటో )
  • 12NDPT01.ఇంటిలో నుంచి వెళ్లిపోయిన అరవింద్​(ఫైల్​ఫోటో)