మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లాలోని జప్తి వీరప్పగూడెంలో వృద్ధురాలిపై దాడి చేసి బంగారు గొలుసు అపహరించడంతో పాటు, మూడు మోటార్ సైకిళ్లను దొంగిలించిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు హుజూర్నగర్ మండలానికి చెందిన భార్గవ చారి, వినోద్ కుమార్, శివ నాగ మల్లికార్జున రావు, పటాన్ అశ్రఫ్ అనే నలుగురు స్నేహితులు జల్సాల కోసం దొంగతనాలకు అలవాటు పడ్డారు.
ఏప్రిల్ 28న జప్తి వీరప్పగూడెంలోని ఓ కిరాణాం షాపు వద్ద వృద్ధురాలిని నమ్మించి, ఆమె మెడలోని పుస్తెలతాడును తెంచుకొని పారిపోయారు. గతంలో పలు బైక్ దొంగతనాలకు కూడా చేశారు. నిందితులు ఆ సొమ్మును అమ్మడానికి గురువారం మిర్యాలగూడ వస్తుండగా ఆలగడప వద్ద పోలీసులకు పట్టుబడ్డారు.
