IPL2023 : ఐపీఎల్లో ఈసారి నలుగురు కొత్త కెప్టెన్లు

IPL2023 : ఐపీఎల్లో ఈసారి నలుగురు కొత్త కెప్టెన్లు

ఐపీఎల్ 2023 సీజన్ కొత్తగా ఉండబోతోంది. కొన్ని సంవత్సరాలుగా ఒకే జట్టును అంటిపెట్టుకొని ఉన్న టాప్ ప్లేయర్లంతా వేరువేరు జట్లలో ఆడబోతున్నారు. కొందరు ప్లేయర్లు రిటైర్మెంట్ ఇస్తే.. మరికొందరు ప్లేయర్లను ఏ ఫ్రాంచేజీ కొనుగోలు చేయలేదు. అంతేకాకుండా.. సీజన్ లో నలుగురు కొత్త కెప్టెన్లు  జట్లను నడిపించబోతున్నారు. సీజన్ లో ఉన్న పది జట్లలో ఏడుగురు టీమిండియా ప్లేయర్లకు కెప్టెన్ గా అవకాశం దక్కింది. 

సౌతాఫ్రికా లీగ్ లో సత్తాచాటి జట్టుకు టైటిల్ తెచ్చిపెట్టిన మాక్రమ్ ను నమ్మిన సన్ రైజర్స్.. ఐపీఎల్ లోనూ పగ్గాలిచ్చింది. గాయంతో దూరమైన  శ్రేయస్ అయ్యర్ స్థానంలో నితిష్ రాణాకు కోల్ కతా కెప్టెన్ గా అవకాశం వచ్చింది. చాలా రోజుల తర్వాత డేవిడ్ వార్నర్ ను ఢిల్లీ కెప్టెన్ గా చూడబోతున్నాం. పంజాబ్.. ధవన్ కు ఛాన్స్ ఇచ్చింది. 

జట్టు.. కెప్టెన్ వివరాలు :

1. చెన్నై సూపర్ కింగ్స్‌- మహేంద్రసింగ్ ధోనీ
2. ముంబయి ఇండియన్స్‌- రోహిత్ శర్మ
3. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌-ఫాఫ్ డుప్లెసిస్
4. ఢిల్లీ క్యాపిటల్స్‌- డేవిడ్ వార్నర్ (రిషబ్ పంత్ స్థానంలో)
5. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నితీశ్ రాణా ( శ్రేయాస్ అయ్యర్ స్థానంలో)
6. సన్‌రైజర్స్ హైదరాబాద్‌- ఆడెన్ మర్‌క్రమ్ 
7. పంజాబ్ కింగ్స్‌- శిఖర్ ధావన్ 
8. గుజరాత్ టైటాన్స్‌- హార్దిక్ పాండ్య
9. లక్నో సూపర్ జెయింట్స్‌- కేఎల్ రాహుల్
10. రాజస్థాన్ రాయల్స్‌- సంజు శాంసన్